సంగారెడ్డి జిల్లా కర్తనూరు శివారు బాహ్య వలయ రహదారిపై గుర్తుతెలియని డీసీఎం.. కారును ఢీకొన్న ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరా తీశారు. జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఓఆర్ఆర్ ప్రమాదంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరా..
నగర శివారులో బాహ్య వలయ రహదారిపై జరిగిన ప్రమాదంపై పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరా తీశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఓఆర్ఆర్ ప్రమాదంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరా..
పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేసి వారి స్వగ్రామాలకు అంబులెన్స్‌లో తరలించాలని పోలీసులకు సూచించారు.
ఇదీ చదవండి: 'రైల్వే ఆస్తుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి'