పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో 133 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు.
పేదల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి - MLA Mahipal Reddy
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హాజరై.. లబ్ధిదారులకు అందజేశారు.
పేదల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం పేదింటి ఆడపిల్లల పాలిట వరంలా మారిందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, పురపాలక అధ్యక్షుడు పాండురంగారెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. ఏడాది క్రితం అదృశ్యమై.. ఆ ఇంట్లో అస్తిపంజరాలై