సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ పరికరాల కిట్లను అందజేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కార్పొరేటర్ శంకర్ యాదవ్ కూడా ఉన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ పరికరాల కిట్ల పంపిణీ - పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ పరికరాల కిట్ల పంపిణీ
విపత్కర పరిస్థితుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ సిబ్బంది నిరంతరం సేవలందించడం అభినందనీయమని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు.
పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ పరికరాల కిట్ల పంపిణీ
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, ఒకవేళ వచ్చినా విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రజలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఎన్ని కేసులు వచ్చినా చికిత్స చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మన భద్రత మనం చూసుకుంటేనే కరోనా నుంచి బయట పడగలమని ఎమ్మెల్యే తెలిపారు.