తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాం: జగ్గారెడ్డి

సంగారెడ్డిలో మెడికల్​ కాలేజ్ ఏర్పాటుపై రేపు అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రజలపై కరోనా ప్రభావం, ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

mla-jaggreddy-on-sangareddy-medical-college
రేపు అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాం: జగ్గారెడ్డి

By

Published : Sep 9, 2020, 6:23 PM IST

సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఎన్నోసార్లు కేసీఆర్​ను అడిగినట్లు తెలిపారు. రేపు అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

రేపు అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాం: జగ్గారెడ్డి

ప్రజలు కరోనాతో ఆర్థికంగా నష్టపోయారని... ప్రజల ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులందరం ప్రశ్నలు లేవనెత్తామని తెలిపారు. కరోనా వచ్చిననాటి నుంచి ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వానికి సూచించనట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'శ్రావణి ఆత్మహత్యకు కారణం వాళ్లే... ఆధారాలున్నాయ్'

ABOUT THE AUTHOR

...view details