రాజకీయం కోసమే భాజపా పని చేస్తోందని... ప్రజల కోసం కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రైతులకు తీవ్ర నష్టం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టినప్పుడే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
సంగారెడ్డి హైవేను దిగ్బంధం చేస్తాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజా వార్తలు
రైతులకి తీవ్ర నష్టం చేసే వ్యవసాయ చట్టాలను భాజపా తీసుకొచ్చిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రేపటి భారత్ బంద్‌లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డి హైవేను రెండు గంటల పాటు దిగ్బంధం చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
సంగారెడ్డి హైవేను దిగ్బంధం చేస్తాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
చిన్న, సన్నకారు రైతులు తాము పండించిన పంటను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రైతుల ఉద్యమం వెనుక రాజకీయ పార్టీలు లేవని, రేపటి బంద్‌లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని స్పష్టం చేశారు. సంగారెడ్డి హైవేని రెండు గంటలపాటు దిగ్బంధం చేస్తామని వెల్లడించారు.