మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డికి వచ్చి ప్రజల ప్రాణాలు తీయొద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇలాంటి సమయంలో హరీశ్‌రావు వివిధ కార్యక్రమాల పేరుతో సంగారెడ్డికి వస్తున్నారని అయన ఆక్షేపించారు. హరీశ్‌రావు చుట్టూ వందల సంఖ్యలో ప్రజలు ఉంటున్నారని అన్నారు. అందువల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
'మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపేస్తారా'
చెట్టు పెట్టాలన్నా మీరే.. కొట్టాలన్నా మీరేనా అని మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ సంగారెడ్డిలో మంత్రి కార్యక్రమాలు అవసరమా అని ప్రశ్నించారు. సంగారెడ్డిపై అంత ప్రేమ ఉంటే రూ.2వేల కోట్లు విడుదల చేయాలని కోరారు.
'మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపేస్తారా'
సంగారెడ్డిపై అంత ప్రేమ ఉంటే 2 వేల కోట్లు ప్రకటించాలన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటికి 500 కోట్లు, సదాశివపేటకు 500 కోట్లు మిగిలిన నాలుగు మండలాలకు 250 కోట్ల చొప్పున ఇవ్వాలన్నారు. మంత్రి హోదాలో వచ్చి పోలీసులు, అధికారులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
ఇదీ చూడండి :దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల