నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఘర్షణ ఉండదని తేల్చి చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ప్రచారం వారిదేనన్నారు. సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావుతో ప్రచారం చేయించుకున్నా... తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. తనను చూసి ఓటు వేయమని ప్రజలను కోరతానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అనవసరంగా తన గ్రాఫ్‌ను దిగజార్చుకుంటున్నారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో పెరిగిన గ్రాఫ్‌ను జీరో చేసుకున్నారని జగ్గారెడ్డి తెలిపారు.
'ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదు'
ఆర్ధిక మంత్రి హరీశ్‌రావుతో ఇకపై ఘర్షణ ఉండబోదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రజలు తెరాసకు రెండోసారి కూడా పట్టం కట్టారని, అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేసినా పట్టించుకోరని చెప్పారు.
Minister Harishrao
ఇవీ చూడండి:30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది