కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేయడం వల్లే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరగకుండా ఆపగలిగామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. హిందువుల ప్రధాన పండుగులైన శ్రీరామనవమి కేవలం పూజారులతోనే పరిమితం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే నెల ఏడో తేదీ తరువాత లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌లో పాల్గొని కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
'రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి' - రంజాన్ ప్రార్ధనలు ఇళ్లలోనే జరుపుకోండి
రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లిం సోదరులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. అనవసరంగా బయటకొచ్చి పోలీసులకు ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
!['రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి' mla-jagga-reddy-request-to-muslims-celebrate-ramzan-at-home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6954536-thumbnail-3x2-jaggareddy.jpg)
రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి