తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి - CONGRESS MLA JAGGAREDDY ON KCR

ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్​లో పులిలా బతికిన కేకే, డీఎస్​ తెరాసలో చేరి పిల్లుల్లా మారిపోయారన్నారు.

కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి

By

Published : Oct 23, 2019, 9:01 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సమ్మె విషయంలో న్యాయస్థానం సూచనతో కమిటీ వేసినందుకు కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల డిమాండ్ న్యాయపరమైనవి కాబట్టే మూడు రోజులు పాటు సంగారెడ్డిలో దీక్ష చేశానని.. ప్రగతిభవన్ ముట్టడిలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పులిలా బతికిన కేకే.. తెరాసలో పిల్లిలా జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్​ పరిస్థితి అలానే ఉందన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా: జగ్గారెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details