తెలంగాణ

telangana

ETV Bharat / state

'పర్యావరణంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి' - Mla gandhi updates

హైదరాబాద్​ మియాపూర్​లోని త్రివేణి పాఠశాలలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ హాజరయ్యారు. విద్యార్థులకు జూట్ బ్యాగులను అందజేశారు.

Mla gandhi
'పర్యావరణంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి'

By

Published : Mar 4, 2020, 10:08 PM IST

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపై హరితహారానికి శ్రీకారం చుట్టిందని, ప్లాసిక్ కవర్ల విక్రయాన్ని నిషేధించిందని గుర్తు చేశారు.

ప్లాస్టిక్​ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో వాసలి చంద్రశేఖర్ ప్రసాద్, ముప్ప సుబ్బయ్య ఆధ్వర్యంలో జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మియాపూర్​లోని త్రివేణి పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు జూట్ బ్యాగులను అందజేశారు.

'పర్యావరణంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి'

ఇదీ చూడండి:'అల్లర్లతో భరతమాతకు ఎలాంటి ప్రయోజనం లేదు'

ABOUT THE AUTHOR

...view details