తెలంగాణ

telangana

ETV Bharat / state

'అన్ని వార్డుల్లో తెరాస గెలిస్తే సమాన అభివృద్ధి సాధ్యం' - సంగారెడ్డిలో ఎమ్మెల్యే ప్రచారం

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్​లో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి మున్సిపల్​ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ​తెరాస తరపున పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

mla campaign in  sangareddy
'అన్ని వార్డుల్లో తెరాస గెలిస్తే సమాన అభివృద్ధి సాధ్యం'

By

Published : Jan 15, 2020, 3:14 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మున్సిపాలిటి ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న తెరాస అభ్యర్థుల తరపున స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. పట్టణంలో ఆయా కాలనీల్లో ఇంటింటికి తిరుగూ ఓట్లు అడిగారు. తెరాస తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేసి గెలుపించాలని కోరారు.

నారాయణ ఖేడ్​లోని 15 వార్డుల్లో తెరాస అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. ఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ఉందన్నారు. అన్ని వార్డుల్లో తెరాస కౌన్సిలర్లు గెలిస్తే సమాన అభివృద్ధి సాధ్యం అన్నారు.

'అన్ని వార్డుల్లో తెరాస గెలిస్తే సమాన అభివృద్ధి సాధ్యం'

ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details