సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ తండాల్లో పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
'బాధిత కుటుంబాలను ఆదుకుంటాం' - narayankhed mla bhupal reddy
పిడుగు పాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. రైతు బీమా ద్వారా మరణించిన యువ రైతుకు ఆర్థిక సాయం అందజేస్తామని భరోసా కల్పించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
కల్హేర్ మండలంలోని పొమ్యా నాయక్ తండాలో పదోతరగతి విద్యార్థి సుదర్శన్ మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా ద్వారా యువరైతుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు.