సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమయింది. పట్టణంలోని 2వ వార్డులో పలు కాలనీల్లో మురుగు కాల్వల్లో యాంటీ లార్వాను వదిలారు. పాదయాత్ర చేస్తూ కాలనీల్లో తిరిగిన ఎమ్మెల్యే కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వీధి కూడా.. ఇల్లులాగే ఉంచుకోవాలి! - నారాయణఖేడ్ ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను తమ ఇల్లులాగే శుభ్రంగా ఉంచుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆయన రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులను ప్రారంభించి.. ప్రజలకు పలు సూచనలు చేశారు.
వీధి కూడా.. ఇల్లులాగే ఉంచుకోవాలి!
తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా వేయాలని, చుట్టూ ఉండే పరిసరాలు కూడా ఇల్లులాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం కానున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా