సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ శివారులో వరదతో కోతకు గురైన రోడ్లను స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో శనివారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలో 68 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
'రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి' - ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తాజా
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏకధాటిగా రెండు గంటలు వర్షం కురవడంతో వరద ఉద్ధృతి పెరిగింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. ఖంజిపూర్ శివారులో గల వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. కోతకు గురైన రోడ్లను స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు.
'రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి'
ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. ఆయా గ్రామశివార్లలో గల వాగుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. కంగ్టి వెళ్లే దారిలో నెహ్రు నగర్ వద్ద వంతెనపై నుంచి వరద నీరు పొంగి పొర్లింది. ఖంజిపూర్ శివారులో గల వంతెన నుంచి వరదనీరు ప్రవహించడంతో రోడ్డు కోతకు గురైంది. కంగ్టి, మనురు మండలాల్లోని చెరువులకు సమృద్ధిగా నీరు చేరి అలుగులు పారుతున్నాయి.