రైతుల వద్ద మిగిలిన పత్తిని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా సీసీఐ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నామని సంగారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం నుంచి టోకెన్లు తీసుకుని మార్కెట్‌కు రావాలని తెలిపారు.
'అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దు' - mla bhoopal reddy
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.
Breaking News
శనగల కొనుగోలు కేంద్రానికీ అనుమతులు వచ్చాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. జొన్నల కొనుగోలు కేంద్రం కోసం వ్యవసాయ మంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు.