ఉద్యోగులు విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపు ఇస్తాయని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీఓ అబ్దుల్ హమీద్ వక్ఫ్ బోర్డు సీఈఓగా బదిలీపై వెళ్లడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమయపాలన, అంకితభావంతో చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. బదిలీపై వెళ్తున్న హమీద్‌కు పూలమాల శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
విధి నిర్వాహణలో గుర్తింపునిచ్చేది అదే - జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీఓ అబ్దుల్ హమీద్ వక్ఫ్ బోర్డు సీఈఓగా బదిలీపై వెళ్లడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొన్నారు.
వీడ్కోలు సమావేశం
ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై వివరణ కోరిన హైకోర్టు