కరోనా మహమ్మారి సామాజిక సేవ అనే కొత్త పాఠాన్ని నేర్పిందని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. తాను ఏ పార్టీ జెండా పట్టుకోలేదని.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా సాగుతున్నానని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి ఓ కొత్త పాఠం నేర్పింది : ఎమ్మెల్సీ కూర - prtu meeting in sangareddy district
హక్కులు-విధులు అనే ప్రధాన నినాదంతో పీఆర్టీయూ సంఘం ఏర్పడిందని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో పీఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ అత్యవసర సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో పీఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ అత్యవసర సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘోత్తమ్ రెడ్డి.. ఉపాధ్యాయుల పదోన్నతులు, అంతర్జిల్లాల బదిలీలు, పాత పింఛన్ విధానంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. ఆరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆకుల మామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, రాష్ట్ర బాధ్యుడు మధుసూదన్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.