సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీలో నివసిస్తూ మేస్త్రీగా పనిచేసే వీకే సూరజ్ తన కుటుంబంతో బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు. అక్కడే గుడిసె వేసుకుని పక్కనే జరిగే భవన నిర్మాణంలో భార్య శాంతాబాయితో కలిసి పనిచేస్తున్నాడు. వారు పనికి వెళ్లగా వారి కుమార్తెలు రాణి(5) రాధిక(4)లు ఇంటిమందే ఆడుకుంటూ పక్క గుడిసెలో ఉంటున్న బిహార్‌కు చెందిన పింటూ కూతురు బిట్టు(7)తో కలిసి కాలనీలు దాటుకుని వెళ్లిపోయారు
పిల్లలు అదృశ్యం... నిఘానేత్రాల సాయంతో కనిపెట్టిన పోలీసులు - telangana varthalu
బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలు తమ పిల్లలు కనిపించకపోవడం వల్ల ఎవరో అపహరించుకుపోయారని ఆందోళనకు గురయ్యారు. ఆడుకుంటూ కాలనీలు దాటి వెళ్లిపోయారని పోలీసులు గుర్తించడంతో చివరకు ఊపిరిపీల్చుకున్నారు.
సూరజ్ తమ గుడిసె వద్దకు వచ్చి చూసేసరికి కొడుకు బ్రిజేష్ మాత్రమే పడుకుని ఉన్నాడు. కూతుర్లు కనిపించలేదు. పక్క గుడిసెలో ఉంటున్న బిహార్‌కు చెందిన పింటూ కుమార్తె బిట్టు కూడా కన్పించకపోవడంతో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శంకర్ నగర్ వద్ద పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడం గుర్తించారు. ఆ దిశగా మరింత ముందుకు వెళ్లడంతో చందానగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు గుర్తించి పిల్లలను పట్టుకుని అమీన్పూర్ పీఎస్‌కు తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దీనితో కథ సుఖాంతం అయ్యింది.
ఇదీ చదవండి: కిడ్నాపైన బాలుడిని రక్షించిన పోలీసులు