తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మిగిల్చిన విషాదం.. అండగా నిలిచిన మంత్రి - సంగారెడ్డి వార్తలు

కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారికి బతుకు భారమై నడిరోడ్డున పడేలా చేసింది. అటు పేదరికం.. ఇటు భర్త మరణం ఆ ఇల్లాలికి తీవ్ర మానసిక బాధను మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తన ముగ్గురు పిల్లల కడుపు నింపడం కోసం ఆ మాతృమూర్తి ఆకలిని చంపుకుంది. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం డాకూర్​కు చెందిన ఆ కుటుంబ దైన్యస్థితిని తెలుసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్ వారిని ఆదుకున్నారు. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీసి అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

Minister satyavathi rathod  responded a family struggling with poor
సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం డాకూర్​

By

Published : May 19, 2021, 6:35 PM IST

మంత్రి సత్యవతి రాఠోడ్ మంచి మనసును చాటుకున్నారు. కొవిడ్ మహమ్మారితో భర్త చనిపోయి బతుకు భారమైన ఓ కుటుంబాన్ని చేరదీశారు. ముగ్గురు చిన్న పిల్లల బాగోగులు చూసుకోలేని పరిస్థతి ఉన్న ఇల్లాలిని ఆదుకున్నారు. ఇది సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం డాకూర్‌కు చెందిన పద్మ దైన్యస్థితిపై విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వారి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీసి అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు హుటాహుటిన తరలి వెళ్లిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు... పద్మ పరిస్థితి చూసి చలించారు. పిల్లలను అక్కున చేర్చుకున్నారు. బలహీనంగా ఉండడంతో పిల్లలకు వెంటనే కరోనా పరీక్షలు చేయించారు. కరోనా నెగెటివ్ రావడంతో వెంటనే చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ ప్రత్యేక వాహనంలో ఆమె స్వగ్రామం జోగిపేట సమీపంలోని డాకూర్ గ్రామం చేర్చారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకు ఇచ్చే అంగన్‌వాడీ పోషకాహారం అందించారు. అనంతరం.. ఆ గ్రామ పంచాయతీ సర్పంచితో మాట్లాడి ఆమె పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అంగన్‌వాడీ కేంద్రం పర్యవేక్షణలో వారికి కావల్సిన పూర్తి సంరక్షణ చేపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్పందించి చేయూత అందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, గ్రామ సర్పంచిని మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి:యథేచ్ఛగా సాగుతోన్న అక్రమ మట్టి తవ్వకాల దందా..!

ABOUT THE AUTHOR

...view details