సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని 15 గ్రామల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు సకాలంలో పూర్తి చేసిన అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. కొడకంచిలో డపింగ్ యార్డు, వైకుంఠ థామాలను పరిశీలించి అధికారులను అభినందించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతీ గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేసి... తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపుతున్నామని వివరించారు.
మండల అధికారుల పనితీరు భేష్ : హారీశ్‌రావు - jinnaram news
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు సకాలంలో పూర్తి చేయటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంచి పనితీరు కనబర్చిన అధికారులు, ప్రజా ప్రతినిధులను అభినందించారు.
minister harishrao visited in jinnaram mandal
ప్రజల సహకారంతో గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయటం అభినందనీయమన్నారు. జిన్నారం మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించామని తెలిపారు. ప్రతీ గ్రామంలో పిల్లలు, గ్రామ ప్రజల కోసం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తిని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనసాగించాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.