తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను ఎవర్ని.. నేనేం చేస్తాను.. విద్యార్థులతో హరీశ్​ మమేకం - Telangana news

సార్.. మిమల్ని పేపర్లో, టీవీలో చూశాం. ప్రత్యక్షంగా చూస్తానని కలలో కూడా అనుకోలేదని.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుతో ఓ విద్యార్థిని తన ఆనందాన్ని పంచుకుంది. సంగారెడ్డి జిల్లా నాగల్​గిద్ద మండలంలోని ఖరసగుత్తి గ్రామంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి ప్రారంభించారు.

నేను ఎవర్ని.. నేనేం చేస్తాను.. విద్యార్థులతో హరీశ్​ మమేకం
నేను ఎవర్ని.. నేనేం చేస్తాను.. విద్యార్థులతో హరీశ్​ మమేకం

By

Published : Feb 12, 2021, 4:22 PM IST

ఆర్థిక మంత్రి హరీశ్​రావును చూసి ఓ విద్యార్థిని ఉద్వేగానికి గురైంది. సంగారెడ్డి జిల్లా నాగల్​గిద్ద మండలంలోని ఖరసగుత్తి గ్రామంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను హరీశ్​రావు ప్రారంభించారు. అనంతరం వేదిక మీదకు విద్యార్థులను పిలిచి వారి లక్ష్యాలు, పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

నేను ఎవర్ని.. నేనేం చేస్తాను.. విద్యార్థులతో హరీశ్​ మమేకం

సుమిత్ర అనే విద్యార్థిని.. సార్.. మిమల్ని పేపర్లో, టీవీలో చూశాం. ప్రత్యక్షంగా చూస్తానని కలలో కూడా అనుకోలేదని హరీశ్​రావుతో ఆనందం పంచుకుంది. అందుకు హరీశ్​... నేను ఎవరూ? ఏం చేస్తాను? అని ప్రశ్నించారు. మీరు హరీశ్​రావు.. మీరు ఆర్థిక మంత్రి, ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. నాకు మీ గురించి అంతా తెలుసు అని ఆ విద్యార్థిని బదులిచ్చింది.

మెను ప్రకారం భోజనం పెడుతున్నారా? గుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు? పుస్తకాలు, నోటు బుక్స్, బట్టలు అందాయా? ఉపాధ్యాయాలు వస్తున్నారా? అని విద్యార్థులను మంత్రి వాకబు చేశారు. లక్ష్మి అనే విద్యార్థిని లక్ష్యం ఏంటీ అని మంత్రి అడగగా.. డాక్టర్ అవుతానని బదులిచ్చింది. డాక్టర్ అయ్యాక హైదరాబాద్​లో ఉంటావా? ఇక్కడికి వస్తావా? అని హరీశ్​రావు తిరిగి ప్రశ్నించారు. ఇక్కడికే వస్తానని బదులివ్వగా... ఖరసగుత్తి గ్రామంలో 30 పడకలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టించామని.. ఇక్కడికి వైద్యురాలిగా వచ్చి అందరికి సేవలందించాలని హరీశ్ రావు సూచించారు.

ఇదీ చూడండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details