Harishrao Fires on Congress : సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన జహీరాబాద్‌లో.. గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాల ద్వారా గిరిజనులకు 10 ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు. గిరిజనులకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పదవుల కోసం రాజకీయం చేస్తున్నాయని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
అంతకుముందు హరీశ్రావుసంగారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన నూతన సభ్యులను సన్మానించారు. సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.4427 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణతో కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
Harishrao on Opposition Parties : తెలంగాణతో కాంగ్రెస్, బీజేపీది పేకమేడల బంధమని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4,000 పింఛన్ ఇచ్చి.. ఇక్కడ హామీ ఇవ్వాలని ప్రశ్నించారు. రూ.25,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని పార్లమెంటులో చెప్పారని.. రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ దక్షిణ భారత్‌పై సవితి తల్లి ప్రేమ చూపుతోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హైకమాండ్ తెలంగాణ ప్రజలని.. బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్ దిల్లీలో ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
"మార్కెట్ యార్డుల్లో సీఎం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. గిరిజనులకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించాం. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక చట్టం తీసుకువచ్చాం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించారు. గిరిజనులకు 95 గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. గిరిజనులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం."- హరీశ్‌రావు, మంత్రి