తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో పర్యటించిన మంత్రి హరీష్​రావు - మంత్రి హరీష్​ రావు

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్​రావు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పర్యటించారు. జిల్లా సహకార మార్కెటింగ్​ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాలు ప్రారంభించారు. ఎంపీ బీబీ పాటిల్​ ఏర్పాటు చేసిన రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాల కిట్లను ప్రజలకు పంచారు.

minister harishr rao tour in zaheerabad town
జహీరాబాద్​లో మంత్రి హరీష్​ రావు పర్యటన

By

Published : Jul 23, 2020, 8:09 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు. జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాలను మంత్రి ప్రారంభించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాల కిట్లను ప్రజలకు పంపిణీ చేశారు.

అనంతరం జహీరాబాద్ మున్సిపాలిటీలో కోటిన్నర నిధులతో కొనుగోలు చేసిన చెత్త సేకరణ ఆటోలు, ట్రాక్టర్లు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. పట్టణ శివారులోని నారింజ వాగు ప్రాజెక్టు మూడేళ్ల తర్వాత జలకళను సంతరించుకోగా.. మంత్రి జల హారతి సమర్పించి పూలు చల్లారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో డివిజన్​ అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

ABOUT THE AUTHOR

...view details