సంగారెడ్డి జిల్లా ఆందో్ల్ జోగిపేట్ పురపాలక పరిధిలో కరోనా నివారణ చర్యలను మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. కరోనా నియంత్రణకు అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బంది చేపడుతోన్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అకారణంగా ఎవరూ బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలంటూ స్థానికులకు ఉద్భోదించారు. ఎంపీ బీబీ పాటిల్, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో కలిసి ఆయన పర్యటించారు.
మంత్రి హరీష్ రావు పర్యవేక్షణ - ఆ కారణంగా బయటకు రాకూడదు మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట్ పురపాలక పరిధిలో కరోనా నివారణ చర్యలను మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. కరోనా నియంత్రణ కు అగ్నిమాపక, మున్సపిపల్ సిబ్బంది చేపడుతోన్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అకారణంగా రోడ్లపై తిరుగుతోన్న వారి వాహనాలను సీజ్ చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి హరీష్ రావు పర్యవేక్షణ
అగ్నిమాపక, స్థానిక మున్సిపల్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా నివారణకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం చల్లే చర్యలను ఆయన పరిశీలించారు. యథేచ్ఛగా రహదారులపైకి వస్తోన్న ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులతోమాట్లాడారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చెయ్యాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.