సంగారెడ్డిలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. కంది పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. మాస్టర్ అవతారం ఎత్తి పదో తరగతి విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు సంధించారు.
'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?' - కంది పాఠశాలలో మంత్రి హరీశ్ సందర్శన
సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పర్యటించారు. కంది జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగారు.
సంగారెడ్డిలో మంత్రి హరీశ్ పర్యటన
విద్యార్థులు ఎక్కాలు చెప్పకపోవడం, తెలుగులో కూడా సరిగ్గా పేర్లు రాయలేకపోవడం వల్ల విద్యా బోధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఉంటే విద్యార్థులు ప్రపంచంతో ఎలా పోటీ పడతారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.
అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ పనులను పరిశీలించారు.
Last Updated : Dec 28, 2019, 5:23 PM IST