Harish Rao Narayankhed Tour : సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఈనెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 3.89 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని వివరించారు. సుమారు రూ.4,500 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకోనున్నాయని వివరించారు.
Harish Rao Narayankhed Tour : 'అక్కడ భూములు అమ్ముకోవద్దు.. భవిష్యత్తులో కోట్లు వస్తాయి' - నారాయణఖేడ్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన
Harish Rao Narayankhed Tour : బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈనెల 21న సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
నారాయణఖేడ్ పట్టణంలోని ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదికను పరిశీలించారు. నారాయణఖేడ్‌లో ఎవరు వ్యవసాయ భూములు అమ్ముకోవద్దని.. రాబోయే రోజుల్లో కోట్లలో ధరలు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి :CM KCR Mumbai Tour : 'సరైన సమయంలో గళం విప్పారు'.. సీఎం కేసీఆర్‌కు ఉద్దవ్ ఠాక్రే ఫోన్