మల్లన్న సాగర్ భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని.. మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారిని గుండెల్లో పెట్టి చూసుకుంటామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ జలాశయం భూ నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే ప్యాకేజీ ఇస్తామన్నారు.
గజ్వేల్ పట్టణ శివారులోని సంగాపూర్‌లోని రెండు పడక గదుల ఇళ్లల్లో తాత్కాలిక నివాసం ఉంటున్న తోగుట మండలం లక్ష్మాపూర్ గ్రామస్తులు దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు తెలుపుతున్నట్లు ఏకగ్రీవ తీర్మానాన్ని మంత్రికి అందజేశారు.
మల్లన్న సాగర్.. నిర్వాసితుల త్యాగం వల్లనే నేడు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చారు. ఇప్పుడు తెరాసకు మద్దతు పలికేందుకు ముందుకొచ్చారు. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ప్రభుత్వ పరంగా అందాల్సిన పరిహారాన్ని అందిస్తాం.