అమ్మ పెట్టదు... అడుక్కుని తిననివ్వదు అన్నట్లు కేంద్రం తీరుతో రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ తీరు ఇలా తయారైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో కల్వరి టెంపుల్ చర్చిలో ఏర్పాటు చేసిన వంద పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని కల్వరి టెంపుల్ డైరెక్టర్ సతీశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ఇవ్వరు రాష్ట్రాన్ని కొనుక్కొనివ్వదు అన్నట్లు మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు 100 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో సమయానికి వ్యాక్సిన్ అందక టీకాల పంపిణీలో జాప్యం జరుగుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.