సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు గాంధీ వర్ధంతి సందర్భంగా.. గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ సత్యం, ధర్మం, అహింసా మార్గంలో ప్రయాణించి దేశ స్వాతంత్య్రానికి కృషి చేశారన్న మంత్రి.. ఆ .. మహాత్ముడి బాటలో ప్రయాణించాలన్నారు.
మహాత్ముని బాటలో నడవండి: మంత్రి హరీశ్‌రావు - sangareddy updates
సంగారెడ్డి జిల్లాలో గాంధీ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మౌనం పాటించారు.
మహాత్ముడి బాటలో నడవండి: మంత్రి హరీష్ రావు
అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనిక్ రావు, భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్