తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్త సేకరణలో నిర్లక్ష్యం.. మంత్రి హరీశ్ ఆగ్రహం - నందిగామలో రైతువేదికను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

చెత్త సేకరణలో నిర్లక్షం వహించిన సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ కార్యదర్శి పద్మావతి, ఏపీఎం శ్రీనివాస్‌లపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు.

Minister Harish Rao inaugurated the raituvedika in sangareddy district
జిల్లాలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

By

Published : Jan 23, 2021, 6:01 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదికను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ క్రమంలో చెత్త సేకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తడి పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి పద్మావతి, ఏపీఎం శ్రీనివాస్‌లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెత్త సేకరణలో నిర్లక్షం వహించిన నందిగామ గ్రామ కార్యదర్శి పద్మావతి, ఏపీఎం శ్రీనివాస్‌లను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సస్పెండ్‌ చేశారు. వారితో పాటుగా ఏపీఓ రాజుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి:పోడు రైతుల బతుకును బజారుకీడ్చొద్దు : కోదండరాం

ABOUT THE AUTHOR

...view details