సంగారెడ్డి జిల్లాలో 2లక్షల 19ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12న ఆర్థిక మంత్రి హరీశ్ రావు సర్వే పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సర్వే నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రతినిధులతో హరీశ్ రావు అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు.
Harish rao: 'సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి' - సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల సర్వే నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రతినిధులతో హరీశ్ రావు అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12న మంత్రి సర్వే పనులను ప్రారంభించనున్నారు.
harish
మంత్రికి అధికారులు ప్రాథమిక సాంకేతిక అంశాలు వివరించారు. ఈ పథకం ద్వారా సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ప్రయోజనం కలుగనుంది. రెండు పంపు హౌసులు ఏర్పాటు చేస్తున్నట్లు వారు హరీశ్ రావుకు వివరించారు. సర్వే పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.