సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన అతిథి గృహాన్ని మంత్రులు హరీశ్‌రావు,ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో మంచి అనుబంధం ఉండేదని హరీశ్ రావు తెలిపారు. 14 ఏళ్ల క్రితం భూపాల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు... తాను తెరాసలో ఉండి ఆయనకే ఓటు వేయించానని హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బీరంగూడ దేవాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మిస్తే భవిష్యత్తులో ఆలయం, ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
'టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్‌కి ఓటు వేయించాను' - sangareddy news
మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో మంచి అనుబంధం ఉండేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన కాంగ్రెస్‌లో ఉండగా... నేను తెరాసలో ఉండి ఆయనకే ఓటు వేయించానని 14 ఏళ్ల క్రితం సంగతిని గుర్తు చేసుకున్నారు.

minister harish rao and indrakaran reddy open ministers guest house at sangareddy