తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరులో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు - telangana news

పటాన్​చెరులోని భారతి నగర్ డివిజన్​లో రూ. 1.2 కోట్లతో నిర్మించబోయే వర్షపునీటి కాలువకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

Minister Harish initiated several development works in Patan cheru
పటాన్​చెరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్

By

Published : Jan 24, 2021, 5:16 AM IST

సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పటాన్​చెరులోని భారతి నగర్ డివిజన్​లో రూ. 1.2 కోట్లతో నిర్మించబోయే వర్షపునీటి కాలువకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ నీరు అందించాలని పలు కాలనీవాసులు కోరగా... సమస్య పరిష్కరించి నీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంఐజీ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద తాగునీటి పైప్ లైన్​ పనులు నిర్వహించాలని కోరారు.

ఇక్రిశాట్ ఫెన్సింగ్ వాసులకు పట్టాలు ఇచ్చేలా చూడాలని వారు మంత్రి కోరారు. దీంతో జిల్లా పాలనాధికారి హనుమంతురావుతో మాట్లాడి పట్టాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఊర్లో ప్రియురాలు, దుబాయ్​లో ప్రియుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details