సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో సఫా బైతుల్ మాల్ సంస్థ శుద్ధి జల నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు చల్లని తాగునీరు అందించే నీటి ప్లాంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజు ప్రారంభించారు.
రోగుల కోసం శుద్ధ జల నీటి కేంద్రం ఏర్పాటు - జహీరాబాద్ తాజా వార్తలు
జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో శుద్ధి జల నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజు ప్రారంభించారు. పేద ప్రజల కోసం సఫా బైతుల్ మాల్ సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న పేద ప్రజల కోసం సఫా బైతుల్ మాల్ సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని బాలరాజు కొనియాడారు. లాక్ డౌన్ వేళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా సుమారు రెండు నెలల పాటు భోజనం అందించడం సహా నామమాత్రపు రుసుముతో అంబులెన్స్ సేవలు అందిస్తున్న సంస్థ ఉదారత గొప్పదని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ శేషు, డాక్టర్ సీతారామరాజు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.