దేశంలో భాజపా ప్రభుత్వం కులాలను, మతాలను విభజించి పాలిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. సంగారెడ్డి అంబేడ్కర్ మైదానంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్క ముస్లిం సమస్య కాదని.. ఇది భారతావని సమస్యని పేర్కొన్నారు.
ఒక నిమిషం వీడియో చేయండి
పౌరసత్వం నిరూపించుకునేందుకు పేద దళితులు, గిరిజనులు, ముస్లిం, హిందువుల వద్ద ధ్రువపత్రాలు లేవని.. చట్టం అమలు చేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్పీఆర్ అమలు చేస్తారని.. దానిని ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఈనెల 25న అర్ధరాత్రి జాతీయ జెండా ఎగురవేసి.. జనగణమన పడాలని.. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఒక నిమిషం వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని కోరారు.