అప్పుడు ఇటుకలు మోసి.. ఇప్పుడు కూరగాయలమ్మి - కూరగాయలు అమ్ముతున్న వలస కార్మికులు
ఆకలి తీర్చుకోవడానికి వలస జీవులు అందుబాటులో ఉన్న అవకాశాలను వాడుకొంటున్నారు. సంగారెడ్డి జిల్లా శివారు హనుమాన్‌నగర్‌లోని ఇటుక బట్టీల్లో కూరగాయలు విక్రయించడమే ఇందుకు నిదర్శనం.
sangareddy district latest news
మహారాష్ట్రకు చెందిన దిలీప్-వందనలకు అయిదుగురు సంతానం. వీరు సంగారెడ్డి జిల్లా శివారు హనుమాన్‌నగర్‌లో ఇటుకలను ట్రాక్టర్లలో నింపుతూ ఉపాధి పొందేవారు. లాక్‌డౌన్ కారణంగా చాలాకాలంగా పనిలేదు. దీంతో వారి పెద్ద కూతురైన రేఖ తన చెల్లెల్లు, తల్లితో కలిసి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తోంది. పూట గడవటానికే చాలా ఇబ్బంది ఉందని ఆమె చెప్పుకొచ్చారు. కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఏరోజుకారోజు బియ్యం కొనుక్కొని వెళుతున్నామని తెలిపింది.