సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ పరిశ్రమ ముందు కార్మికులు, పరిశ్రమ సిబ్బందికి బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హోమియోపతి మందులు పంపిణీ చేశారు. కరోనాతో పాటు.. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ తరుణంలో కార్మికుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన హోమియోపతి మాత్రలు ప్రతీ ఒక్కరు వాడాలని కార్మికులకు సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా వీటిని వాడితే ఉపయోగం ఉంటుందని బీఎంఎస్ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ తెలిపారు.
కార్మికులకు హోమియోపతి మందులు పంచిన బీఎంఎస్ నాయకులు - కార్మికులకు మెడిసిన్ పంపిణీ
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ పరిశ్రమ ముందు బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు, పరిశ్రమ సిబ్బందికి హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కరోనాతో పాటు.. సీజనల్ వ్యాధులు కూడా ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ తరుణంలో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు హోమియోపతి మందులు పంచుతున్నట్టు కార్మిక సంఘం నాయకులు తెలిపారు.
కార్మికులకు హోమియోపతి మందులు పంచిన బీఎంఎస్ నాయకులు