పేద ప్రజలకు అండగా నిలవాల్సిన సమయమిదని మెదక్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీఇంఛార్జి గాలి అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బండ్లగూడ గ్రామంలో లాక్డౌన్ మూలంగా ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్న 150 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు.
పేదలకు నిత్యావసర సరుకుల అందజేత - నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
సంగారెడ్డి జిల్లా బండ్లగూడ గ్రామంలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్ననిరుపేదలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గాలి అనిల్ కుమార్ నిత్యావసర సరుకులు అందజేశారు.

నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలని గాలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు