సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామపరిధిలో శివాలయంలో నిర్వహించిన నవగ్రహ సమేత స్పటిక లింగ ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ - srr
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు శివాలయంలో నిర్వహించిన నవగ్రహ సమేత స్పటిక లింగ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
నిర్వాహకులు భక్తుల కోసం స్పటిక లింగాన్ని ప్రతిష్ఠించారని ఎంపీ తెలిపారు. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా సంస్థ ఈ ప్రాంతంలో శివాలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభినందించారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి
TAGGED:
srr