కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహర్నిషలు కృషి చేస్తోందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
'ఈ సమయంలో.. మనసు, శరీరాన్ని దృఢ పరుచుకోండి' - corona updtes in sangareddy
ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సమయాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు యోగా, ధ్యానం వంటి వాటితో మనసు, శరీరాలను దృఢ పరుచుకోవాలని సూచించారు.
సంగారెడ్డిలో సరుకుల పంపిణీ
సంగారెడ్డిలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సరుకులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే వార్డు కౌన్సిలర్ల సాాయం తీసుకోవాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు యోగా, ధ్యానం చేస్తూ ఈ సమయాన్ని మనసు, శరీరాలను దృఢ పరుచుకోవడానికి వినియోగించుకోవాలన్నారు.