మెదక్ పార్లమెంటు స్థానానికి తెరాస సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాలి అనిల్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భాజపా అధికార ప్రతినిధి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావు కమలం పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో మరో కొన్ని గంటల్లో తేలిపోతుంది.
మెదక్‌లో నిలిచేదెవరు? - medak
మెతుకు సీమ అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన గడ్డ... నాడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. తెరాస ఆవిర్భావం నుంచి గులాబీతోటగా మారింది. విజయపరంపరను కొనసాగించడానికి కారు పార్టీ.. పూర్వవైభవం సాధించడానికి హస్తంపార్టీ ప్రయత్నిస్తుంటే.. ఉనికి కోసం భాజపా పోరాటం చేస్తోంది.
medak-mp-election