సందీప్ రెడ్డి సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా వెంతుర్ మండలం వీరపల్లి గ్రామం. గడవులోగా పరీక్ష రుసుం చెల్లించలేదని.. మనస్తాపానికి గురైన సందీప్ రెడ్డి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు.
పరీక్ష ఫీజు చెల్లించలేదని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య - ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
వార్షిక పరీక్షల ఫీజు గడువులోగా కట్టకపోవటం వల్ల మనస్తాపానికి గురైన ఎంబీబీఎస్ విద్యార్థి సందీప్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పరీక్ష ఫీజు చెల్లించలేదని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య