సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి దర్శించుకున్నారు. దత్తగిరి మహారాజ్ అమర తిథి ఉత్సవాలకు హాజరై దత్తహోమం పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తండ్రి ఎంపీ కేశవరావు దత్త జయంతి ఉత్సవాల్లో కట్టిన ముడుపును మేయర్ విజయలక్ష్మి విప్పి మొక్కులు చెల్లించుకున్నారు.
దత్తగిరి ఆశ్రమాన్ని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి - Telangana news
బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి దర్శించుకున్నారు. దత్తగిరి మహారాజ్ అమర తిథి ఉత్సవాలకు హాజరై దత్తహోమం పూర్ణాహుతి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.

మేయర్ విజయలక్ష్మి
వేడుకలకు హాజరైన మేయర్‌ను ఆశ్రమ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజు పూలమాల, శాలువాతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు. అంతకుముందు ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి మేయర్ విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి:సాగర్ నియోజకవర్గంలో గోడపత్రికల కలకలం