సీఎం కేసీఆర్ పెళ్లి రోజును పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ఆర్. పోతనపల్లి సర్పంచ్ మాస్కులు పంపిణీ చేశారు. గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న 250 మంది కూలీలకు సర్పంచ్ లావణ్య మాస్కులు అందించారు.
సీఎం పెళ్లిరోజు సందర్భంగా మాస్కుల పంపిణీ - LOCK DOWN UPDATES
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ఆర్.పోతనపల్లిలోని ఉపాధిహామీ కూలీలకు మాస్కులు పంచారు ఆ గ్రామ సర్పంచ్. సీఎం కేసీఆర్ పెళ్లి రోజు సందర్భంగా మాస్కులు పంచినట్లు సర్పంచ్ తెలిపారు.
సీఎం పెళ్లిరోజు సందర్భంగా మాస్కుల పంపిణీ
పంపిణీ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ పాల్గొన్నారు. పనులు చేసే సమయంలో కూలీలు భౌతిక దూరం పాటించాలని జడ్పీటీసీ సూచించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.