సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సుభాశ్గంజ్ ప్రాంతంలోని పాత కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5.50 కోట్ల నిధులు మంజూరు చేయడం వల్ల నూతన భవనాన్ని నిర్మించడానికి పాత రేకుల షెడ్లను నేలమట్టం చేశారు.
పాత మార్కెట్‌ను కూల్చేసిన మున్సిపల్ అధికారులు - సంగారెడ్డి తాజా వార్త
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సమీకృత మాంసం, కూరగాయల మార్కెట్ నూతన భవన నిర్మాణం కోసం పాత కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ అధికారులు కూల్చేశారు.
పాత మార్కెట్‌ను కూల్చేసిన మున్సిపల్ అధికారులు
నిర్మాణ టెండర్ల ప్రక్రియ పూర్తయిన పాత షెడ్లు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు కోరినా కూరగాయల వ్యాపారులు కాలయాపన చేస్తుండటం వల్ల పోలీసు బలగాలను మోహరించి కూల్చివేత ప్రక్రియను పూర్తిచేశారు. షెడ్లలో కూరగాయలు, ట్రేలను పక్కన వేసి పనులు పూర్తి చేయడం పట్ల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.