సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ కూడలిలో మాదిగ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. యువత అంబేడ్కర్, జగ్జీవన్రామ్లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేటి తరం హక్కుల సాధనను విస్మరిస్తోందని... రాజ్యాంగబద్ధంగా ఎస్సీలంతా హక్కులకై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.
జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ - జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ
యువత అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని చింతలఘాట్ కూడలిలో ఆయన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ
ఎస్సీల హక్కుల కోసం.. విరామం లేకుండా పోరాటం చేస్తానని, ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహనీయుల పోరాట స్ఫూర్తిని యువత అందుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు