సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. సిర్గాపూర్కు చెందిన ప్రవీణ్ (35) నారాయణఖేడ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటన అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడం వల్ల ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ గురించి గాలిస్తున్నారు.
ఇవీ చూడండి:'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'