తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి - భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

భవన నిర్మాణ సామాగ్రిని తొలి అంతస్తు నుంచి పైకి తీసుకెళ్తూ... ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్​చెరు పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man-dead-to-fall-from-building
నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

By

Published : Apr 25, 2020, 11:40 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళానికి చెందిన రాముడు, అతని మేనల్లుడు త్రినాథ్​లు మరో 20 మంది కార్మికులతో కలిసి... గీతం విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న బాయ్స్ హస్టల్ పనులకోసం సంవత్సరం క్రితం హైదరాబాద్​కు వచ్చారు. లాక్​డౌన్​లో భాగంగా నెలరోజులుగా పనులు నిలిచిపోయిన నేపథ్యంలో కూలీలు అక్కడే విశ్వవిద్యాలయ భవనంలోనే ఉంటున్నారు.

ఈనెల 24వ తేదీన కార్మికులు కలిసి... కొత్తగా నిర్మిస్తున్న భవనం కింద నుంచి పలు సామాగ్రి తొలి అంతస్తు నుంచి పైకి తీసుకెళ్తుండగా... ప్రమాదవశాత్తు త్రినాథ్ జారి కిందపడ్డాడు. తల వెనుక తీవ్ర గాయం కావడంతో ఇస్నాపూర్​లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం బీరంగూడలోని పనేషియామెరీడియన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా... అప్పటికే చనిపోయిననట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:అన్ని అవయవాలపైనా కరోనా ముప్పేట దాడి!

ABOUT THE AUTHOR

...view details