మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రభుత్వం తరఫున ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సంగమేశ్వరుడి సేవలో ప్రజాప్రతినిధులు - maha shivaratri 2021
మహాశివరాత్రిని పురస్కరించుకుని తెరాస ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావులు సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సంగమేశ్వర ఆలయానికి మహాశివరాత్రి శోభ
వారికి ఆలయ ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు శివలింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
- ఇదీ చూడండి :శివరాత్రినాడు పరమశివుణ్ణి ఎలా అభిషేకించాలి?