పిచ్చికుక్క స్వైర విహారం 48 మందిని ఆసుపత్రికి పంపింది. పిచ్చిపట్టిన ఓ శునకం..దారిన పోయే వారినే కాదు.. ఇంట్లో ఉన్న వారిని గాయపరిచింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది.
పటాన్చెరులో పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గత రాత్రి నుంచి 48మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. పట్టణ పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ దారిన పోయే వారినే కాకుండా ఇళ్లల్లో ఉన్నవారిని కూడా కరిచింది.
ఏమరుపాటుగా ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చి పిచ్చికుక్క దాడి చేసిందని బాధితులు వాపోయారు. స్థానికంగా కుక్కల భయం ఉందని.. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వ్యాక్సిన్ కొరత లేదు